పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే కల్యాణ మండపంలో కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతో పాటు పురోహితుడు, వధువరుల బంధువులు అందరూ వచ్చారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకుతో కాకుండా వేరే యువకుడితో వివాహం జరిగింది.
ఇప్పుడు ఈవీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు చూస్తుండగానే గ్రామస్తులు, అమ్మాయి తరపు బంధువులు ఈవివాహం జరిపించడంతో వివాహ వేడుకకు వచ్చిన వాళ్లంతా షాక్ అయ్యారు. బీహార్ వెస్ట్ చంపారన్ జిల్లాలోని మంగళ్‌పూర్‌లో ఈ వెరైటీ వెడ్డింగ్ జరిగింది. వీడియో మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో వెరైటీ ఘటనలు జరగడం చూశాం. కాని బిహార్‌లో ఓ పెళ్లి వేడుకే వెరైటీగా జరిగింది.
ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది. వెస్ట్ చంపారన్ జిల్లా నౌతాన్ బ్లాక్‌లోని మంగళ్‌పూర్ గ్రామానికి చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు రెండు కుటుంబాలకు చెందిన బంధు, మిత్రులు హాజరయ్యారు. అయితే విచిత్రం ఏమిటంటే ముందుగా నిర్ణయించిన నిశ్చితార్ధం సమయానికి పెళ్లి కూతురు మెడలో వేరే యువకుడితో పెళ్లి జరిపించారు గ్రామస్తులు. ఇదంతా పెళ్లి పీటలపై నూతన వరుడు చూస్తుండగానే జరగడంతో వీడియో వైరల్ మారింది.