టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఒక మంచి పేరు సంపాదించుకుంది. నటుడుగా మోహన్ బాబు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమాన హీరోగా మారాడు. వయసు పై పడిన కొద్దీ సహాయ పాత్రలలో కూడా చేశాడు. రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు మోహన్ బాబు. నిజానికి మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. అయితే మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తుండగా.. ఉన్నట్టుండి మనోజ్ పెట్టిన ఓ వీడియో సంచలనంగా మారింది.
అన్న మంచు విష్ణు ఆగడాలు ఇవీ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి షాకిచ్చారు మంచు మనోజ్. తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణు పై మనోజ్ సీరియస్ కావడం హాట్ టాపిక్ అయింది. మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడంతో జనాల్లో డిస్కషన్స్ షురూ అయ్యాయి.
మంచు కుటుంబంలో గొడవలకు ఆస్తుల పంపకాలే కారణం అనే టాక్ అయితే బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకిని సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ షాకింగ్ విషయాలు ప్రస్తావించారు. మంచు విష్ణు, మంచు మనోజ్‌ల మధ్య వివాదానికి కారణమైన సారధి.. ఆ కుటుంబానికి ఎంతో దగ్గరైన వ్యక్తి అని చెప్పారు చిట్టిబాబు.
మోహన్ బాబుకి సంబంధించిన అన్ని పర్సనల్ పనుల్ని చూసేది సారధే అని చెప్పిన చిట్టిబాబు.. ఈ ఇష్యూ గురించి డీప్ గా మాట్లాడారు.