28ఏళ్ల కోడలితో 70సంవత్సరాల మామ కొత్త కాపురం, ట్విస్ట్ ఏంటో తెలిస్తే..?

70సంవత్సరాల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి నలుగురు సంతానం. 12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే 70 ఏళ్ల వయసున్న ఓ మామ తన కొడుకు మృతి చెందడంతో ఒంటరైన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందని కైలాష్ యాదవ్ (70) అనే వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం భార్య మృతి చెందింది. కైలాష్ ఒంటరిగానే జీవిస్తున్నాడు. అనంతరం కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరుగా కాపురం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మూడో కుమారుడు ఇటీవల చనిపోవడంతో కోడలు పూజ ఒంటరిదైంది. దీంతో మామ కైలాష్ తన కోడలైన పూజను సమీపంలోని ఓ గుడికి తీసుకెళ్లి నుదుటిన సింధూరం దిద్ది పూల దండ వేసి వివాహం చేసుకున్నాడు. పూజ కూడా మామ మెడలో పూల మాల వేసి తన సమ్మతిని తెలిపింది.

ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడలిపై అంత ప్రేమ ఉంటే ఆమె వయసుకు తగ్గట్టు ఇంకో వరుడిని చూసి పెళ్లి చేయాలి కానీ వృద్ధుడైన మామకు ఆ వయసులో పెళ్లి అవసరమా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్దరూ మేజర్లు నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందంటూ మరికొందరు వీరి వివాహాన్ని సమర్ధిస్తున్నారు. ఐతే స్వగ్రామస్తులు ఇందేందయ్యా పెద్దమనిషి అని ప్రశ్నిస్తే కైలాష్ యాదవ్ నోరుమెదపకుండా మౌనంగా ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *