2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ప్యాట్నీ లోని ప్రభుత్వ కాలేజీలో 1973సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివినట్టు పేర్కొన్నారు. ఇక 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం 2023 మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మూడు అఫిడవిట్ లపై రాంపల్లి దాయార గ్రామవాసి అయిన కందాడి అంజిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇచ్చారు.
ఆయన మూడుసార్లు ఎన్నికలలో మూడు కాలేజీల పేర్లు ప్రస్తావించడాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇంతే కాదు వయసు విషయంలో కూడా మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన అంశాలు తప్పుగా ఉన్నాయన్నారు.