పాలు అమ్మిన బండి నడిపిన మల్లారెడ్డి చేతక్ బండి ఏసుకొని కట్ లు కొట్టాడు.

మినిస్టర్‌గా కంటే పంచింగ్‌ ప్రసంగాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారాయన. ఇప్పుడు అదే మల్లారెడ్డి తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. దసరా పండుగ రోజున ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి తన పాత రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. దసరా సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బోయిన్ పల్లిలో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న వాహనాలన్నింటిని ఒకే దగ్గర ఉంచి పూజలు చేశారు.

ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన పాత స్కూటర్‌కు సైతం తీసుకువచ్చారు. ఇన్నాళ్ళ తరువాత కూడా చక్కచెదరకుండా ఉన్నా అదే స్కూటర్‌ నడుపుతూ చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 30 సంవత్సరాల క్రితం అదే స్కూటర్‌పై తిరుగుతూ పాలు అమ్మిన రోజుల్ని అందరితో పంచుకున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డ.. మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు అదే స్కూటర్‌పైనే చక్కర్లు కొట్టి సరదా గడిపి ఎంజాయ్ చేశారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్న మంత్రి.. అనాటి స్కూటర్ చేతక్‌ బండి కనిపించగానే హుషారుగా షికారు చేశారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డిది ఓ ప్రత్యేకత. తెల్లటి చొక్కా వేసుకుని అసెంబ్లీలో నిలబడి..మస్త్‌ ముచ్చట్లు చెప్పారు మన మల్లారెడ్డి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్షాలను, ప్రధాన మంత్రిని.. ఎవరినీ వదల్లేదు. అందరిని పేరుపేరునా వాయనాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *