డైరెక్టర్ గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి లోపల శవమై కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదు. అయితే మలయాళ దర్శకుడు ప్రకాశ్ కొలేరి కేరళలోని వాయనాడ్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
వాయనాడ్‌లో ఒంటరిగా ఉంటున్న ఆయన రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు మంగళవారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన శవమై కనిపించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రకాశ్ కొలేరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాను తొలిసారి దర్శకత్వం వహించిన ‘మిజియితలిల్ కన్నీరుమయి’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1999లో విడుదలైన ‘వరుణ్ వారథిరికిల్ల’ తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత ‘పాట్టుపుస్తకం’ చిత్రానికి మళ్లీ దర్శకత్వం వహించారు. ఫిలిం మేకర్‌గా ఇదే ఆయనకు చివరి సినిమా. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన స్క్రిప్ట్ రైటింగ్, నటన నేర్చుకున్నారు.