తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె శవమై కనిపించింది. ఉరి వేసుకుని రెంజూష మీనన్ బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టీవీ సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లో నటించి మెప్పించిన రెంజూష మీనన్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
తన భర్తతో కలిసి తిరువనంతపురంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆమె ఉరి వేసుకున్నారు. ఆమె మృతిపట్ల మలయాళ సినీ నటీనటులు, ఫ్యాన్స్ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆమె ఆర్ఠిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యకు ఇదే కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె బలవన్మరణానికి గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు.
కొచ్చికి చెందిన రెంజూ షా యాంకర్‌గా తన కెరీర్‌ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘స్త్రీ’, ‘నిజలాట్టం’, ‘మగలుడే అమ్మ’, ‘బాలామణి’ వంటి సీరియల్స్‌తోపాటు ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా తాను యాక్టివ్‌గా ఉన్న ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. రీల్‌లో ఆమె సంతోషంగా కనిపించారు. అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త అందరినీ కలచివేస్తోంది.