“హనుమాన్” టీజర్ విడుదల కాగానే హిందీ మార్కెట్ నుంచి ఎంక్వరీలు మొదలయ్యాయి. దాంతో, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నార్త్ ఇండియన్ మార్కెట్ లో భారీగా క్రేజ్ ఉంటుందని గ్రహించి సినిమా విడుదల తేదీని 8 నెలలు పోస్ట్ పోన్ చేశారు. చిన్న సినిమాని పెద్ద సినిమాగా డిజైన్ చేసేందుకు అంత గ్యాప్ తీసుకున్నారు.
ఐతే, అసలు ఫోకస్ మాత్రం తెలుగు, హిందీ మార్కెట్లే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పై టీం “హనుమాన్” చాలా ధీమాగా ఉంది. 1500 థియేటర్స్ ఇప్పిటకే నార్త్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు ఇండియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ మూడ్ మొదలైంది.
నార్త్ ఇండియాలో “రామ్ మందిర్” అనేది ఒక ఎమోషన్ . అందుకే, “హనుమాన్” చిత్రంకి నార్త్ ఇండియాలో బాగా క్రేజ్, డిమాండ్ ఉంటుంది. బయ్యర్లు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.