బస్సు ఫ్రీ వద్దు గ్రీ వద్దు..! నాకు భయమైతుంది. ఈ అక్క మాటలు వింటే..?

ఎన్నో రోజుల నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకున్న మహిళలు ఉచిత ప్రయాణం కావడంతో వరుస కట్టి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట,కొల్లాపూర్ డిపోల పరిధిలో ఒక రోజులోనే 1లక్ష93 వేల 66 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. అయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడ ప్రయాణికులకు ఎలా టికెట్ తీసుకోవాలి.

ఎప్పుడు బస్సు వస్తుందనే వివరాలు తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కోసం ఆర్టీసీ ఉచిత కాల్ సెంటర్ నంబర్ ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.

జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *