భర్త పుట్టిన రోజున మర్చిపోలేని కానుక ఇచ్చిన మహాలక్ష్మి, ఏంటో మీరే చుడండి.

తాజాగా తన భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది మహాలక్ష్మి. భర్త రవీందర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. 6 అడుగుల భర్త ఫోటో ఫ్రేమ్ ని మహాలక్ష్మి స్వయంగా చేయించి రవీందర్ కి ప్రజెంట్ చేసింది. భార్య మహాలక్ష్మి ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ గిఫ్ట్ చూసి రవీందర్ థ్రిల్ అయ్యారు. ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త పుట్టినరోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది మహాలక్ష్మి.

ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేశారు రవీందర్. అయితే మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె భర్త రవీందర్‌ మాత్రం లావుగా, భారీ కాయంతో ఉంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలామందిని షాక్‌ గురిచేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది రెండో వివాహం కాడంతో పెళ్లైన మరుసటి క్షణం నుంచే ఈ జోడీపై ట్రోలింగ్‌ స్టార్టయ్యింది. ఆస్తి, డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను వివాహం చేసుకుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఇక రవీందర్‌ శరీరాకృతిపై కూడా నెగెటివ్‌ పోస్టులు పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి- రవీందర్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్. సోషల్‌ మీడియా తమ రొమాంటిక్‌ ఫొటోస్‌ను షేర్‌ చేసుకుంటూ ట్రోలర్స్‌కు గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా రవీందర్ పుట్టిన రోజును పురస్కరించుకుని తన భర్తకు మర్చిపోలేని బహుమతినిచ్చింది మహాలక్ష్మి. ఆ స్పెషల్ గిఫ్ట్‌ ఏంటంటే.. 6 అడుగులు ఎత్తున్న రవీంద్ర ఫొటోను చక్కటి పెయింటింగ్‌తో తీర్చిదిద్ది తన భర్తకు కానుకగా ఇచ్చింది.

‘లైఫ్‌లో నాకు మళ్లీ ధైర్యం నూరిపోసిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. లవ్యూ ఫర్‌ ఎవర్‌’ అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది మహాలక్ష్మి. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ‘లవ్లీ కపుల్‌’, ‘అన్యోన్య దాంపత్య బంధం’ అంటూ నెటిజన్లు మహాలక్ష్మి దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *