మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మాధవి, స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించింది. అయితే ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ మాత్రం రాలేదు. 2018లో బీజేపీలో చేరిన ఆమె.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది.
అయితే మాధవీ లత కృష్ణుడిని బాగా ఆరాధిస్తారు. 2014 నుంచి కృష్ణుడు తన ఫ్రెండ్‌గా మారిపోయాడని ఆయనతో మాట్లాడుతూ ఉంటానని ఆయనతో కనెక్ట్ అయిన వారికే ఆ ప్రేమ తెలుస్తుందని చెప్పారు. 2023 లో కృష్ణుడు వస్తానని చెప్పాడని ఈ విషయం అందరికీ కామెడీ అనిపించినా అప్పటి నుండి తనకు పెళ్లంటే ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పారామె.
ఒకవేళ కృష్ణుడు రాకపోయినా దానికి ఏదో రీజన్ కూడా ఉంటుందని అన్నారు. అసలు పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదట మాధవీ లతకి. అలాంటిది కృష్ణుడు వస్తానని చెప్పిన దగ్గర్నుంచి చాలా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు.