హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని ఇప్పుడు ఆయనపై కేసు పెట్టారు.
చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలుపెట్టాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కలిసికట్టుగా పోరాడాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఇరు పార్టీల చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం.
ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా.. లోకేశ్‌ను జైలుకు పంపిస్తామని వైకాపా మంత్రులు చెబుతున్నారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే చంద్రబాబును జైల్లో పెట్టారు. అందుకే కలిసికట్టుగా పోరాడుతామని పవన్ కల్యాణ్ జైలు వద్దే ప్రకటించారు. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడిని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారంటే… సామాన్యుడు తిరిగే పరిస్థితి ఉంటుందా?” అని లోకేశ్ ప్రశ్నించారు.