లోకేష్ మాటలకూ ఏడ్చేసిన యాంకర్ ఉదయ భాను..ఒక్కసారిగా మీటింగ్ మొత్తం సైలెంట్.

ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం.

ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉదయభాను ఒంగోలులో నిర్వహించిన నారా లోకేశ్ సభలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నేటి సాయంత్రం జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

లోకేశ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు. ఎప్పట్లాగానే ఉదయభాను తన జోష్ తో సభికులను ఆకట్టుకున్నారు. అంతేకాదు, తనలో సామాజిక స్పృహ కూడా ఉందని కొన్ని దృష్టాంతాల ద్వారా చాటుకున్నారు. గంగ గరుడాలెత్తుకెళ్లేరా… ఇంక ఆంబోతుల ఆట సాగేరా అంటూ ఓ గీతాన్ని కూడా ఉదయభాను ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *