సిమ్లా యాపిల్ లా మెరిసిపోతూ ఉండే ఖుష్బూకి ఏకంగా తమిళనాడులో గుడి కట్టిన చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు తన అందంతో నటనతో కుర్రకారుని ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఖుష్బూ 50 ఏళ్ళ వయసులోనూ తరగని అందం తన సొంతం అంటుంది. అయితే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైం లోనే కుష్బూ డైరెక్టర్ సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే కుష్బూకి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. అంతేకాదు వయసులో చిన్నవాడైనా స్టార్ హీరోతో ఒక్కసారి అలా చేయాలని ఉంది అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష్బూ అత్తా, తల్లి పాత్రలతో సినిమాలలో నటిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. అయితే కుష్బూకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటకు చెప్పింది.
ఆమె మాట్లాడుతూ నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. అంతేకాదు చాలా రోజుల నుండి నేను జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడుతున్నాను. కానీ ఇప్పటివరకు అది నెరవేరడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కుష్బూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన కుష్బూ తనకంటే చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూస్తుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో అంటే అలా ఉంటుంది అంటూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు.