కుమారీ ఆంటీ క్రేజ్ చూసి.. ఆమె నెక్స్ట్ బిగ్బాస్ సీజన్లోకి వస్తుందని అంతా ఫిక్సయ్యారు. అయితే ఆలోపే కుమారీ ఆంటీ ఈటీవీ షోలలో కనిపిస్తుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. కుమారీ ఆంటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. కుమారీ ఆంటీ స్టార్ మా బీబీ ఉత్సవంలో సందడి చేసింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అయితే హైదరాబాద్ లో ఒక ఏరియాలో మీల్స్ అమ్ముకునే కుమారి ఆంటీ ఆ మధ్య ‘మొత్తం 1000… రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పాజిటీవ్, నెగిటీవ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి కుమారి ఆంటీ వద్దకు యూట్యూబర్స్, రీల్స్ చేసేవారు ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టారు. దీంతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల బీబీ ఉత్సవం అనే టీవీ షోలో కుమారి ఆంటీ పాల్గొని తెగ హంగామా చేసింది.
ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కూడా వచ్చేసింది. షోలో తన ఫుడ్ తీసుకొచ్చి అక్కడ ఉన్నవారందరికీ వడ్డించింది. ఈ కార్యక్రమంలో తనదైన పంచ్ లతో అదరగొట్టే హైపర్ ఆదీ, కుమారి ఆంటీతో భలే కామెడీ పండించాడు. ఆమె కుడా ఏమాత్రం తడబడకుండా అందరికి మంచి వినోదాన్ని పండించింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.