కుమారి అంటీ..ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ ఛానెళ్ల దృష్టి ఆమె మీద పడింది. దీని వల్ల మొదట కుమారి ఆంటీకి పాపులారిటీ వచ్చి బిజినెస్‌కు హెల్ప్ అయింది. కానీ అటెన్షన్ పెరిగేకొద్దీ సమస్యలు మొదలయ్యాయి. జనంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, మీడియా వాళ్ల తాకిడి పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు పెరిగి పెద్ద న్యూసెన్స్ లాగా తయారైంది.
దెబ్బకు పోలీసులు జోక్యం చేసుకుని ఆమె బిజినెస్ ఆపించేశారు. అయితే ఎంతలా అంటే తినడానికి వచ్చిన వాహనదారులతో రోడ్డు ట్రాఫిక్ జామ్ కావడం, పోలీసులు ఆమె స్టాల్‌ను క్లోజ్ చేయంచడం, ఆపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించడంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు కుమారీ ఆంటీ.
అంతేకాదు వీలు చూసుకుని ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానిని ముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రచారం జరగడంతో కుమారీ ఆంటీ క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం నగరంలో ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆమె చేతి వంట రుచి చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇన్‌స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్.. ఎక్కడ చూసినా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలే దర్శనమిస్తున్నాయి.