అవును… వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇటీవల బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడించింది.
ప్రధానంగా బీఆరెస్స్ నేతలు ఇంత బలంగా చెబుతుండటం వెనుక కథ ఏమై ఉంటుందనే చర్చ బలంగా నడిచింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆరెస్స్, బీజేపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, టీకాంగ్రెస్ నేతలు చారుకొండ వెంకటేష్, మధుసూదన్ లు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.