మూడు రోజులుగా కవిత ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రచారం చేస్తున్నారు. ఐతే.. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎండ బాగా ఉంది. అలాంటి చోట ఆమె ప్రచారం చేస్తూ.. నీరసించిపోయి… ప్రచార వాహనంలోనే సొమ్మసిల్లి పడిపోయారు. అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రచార వాహనంలోనే స్పృహతప్పి పడిపోయారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కవిత.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు.. కవిత రాయికల్ మండలం, ఇటిక్యాలలో పర్యటించారు కవిత. ప్రచార వాహనం మీద నిలబడి ఉన్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు.
కళ్లు తిరిగి ప్రచార వాహనం మీద పడిపోయారు. కవిత కింద పడటం గమనించిన వారు.. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి సపర్యలు చేశారు. గాలి ఆడేలా చేసి.. ఆమె విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేశారు. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ.. నిత్యం ప్రయాణాలు చేస్తుండటం వల్ల ఇలా అస్వస్థతకు గురయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.