ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడి అధికారులు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు. కవిత బంధువుల ఇళ్ళలో ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుండి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
మాదాపూర్ లోని కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కవిత కాల్ డేటా ఆధారంగా కవిత భర్త అనీల్ సోదరి అఖిల ఇంట్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే కవితను ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈడీ దర్యాప్తులో ఏం చెప్తారు అన్నది ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ క్రమంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంకా ఈడీ దాడులు కొనసాగుతున్న క్రమంలో, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.