చాలా మంది కార్తీక మాసం నెల రోజులు పూజలకు అంకితం అయ్యిపోతారు.సాధారణంగా అందరు కార్తీకమాసం అంటే శివార్చన మాత్రమే చేయాలనీ అనుకుంటారు. కానీ కార్తీక మాసం శివ కేశవులు ఇద్దరిది.ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు విష్ణువు, మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శివుడి పూజిస్తారు .ఈ విధంగా పూజలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతాం. అయితే ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం పౌర్ణమి అలాగే ఏకాదశిలో చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా అత్యంత శుభమైన ఫలితాలని తప్పకుండా ఇస్తాయని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం..
అలాగే ఈ కార్తీకమాసం దీపారాధనకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా కార్తీక మాసంలో తామసం కలిగించేటువంటి ఉల్లిని వెల్లుల్లిని తినకూడదు అని చెప్పారు. ఈ మాసంలో ఉల్లి వెల్లుల్లి చాలామంది నిషేధిస్తారు. ఈ రెండు పదార్థాలతో చేసినటువంటి ఆహారం తీసుకోకూడదు.. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో భుజించండి. ఇంట్లో తీసుకునే ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడండి.. అలాగే మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు.. సాధారణంగానే ఈ మద్యం మాంసం మన ఆరోగ్యానికి కుటుంబ వాతావరణము ఎప్పుడు హాని చేసేవి.. ఈ రెండిటి అలవాటు లేని వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు.
మద్యం మాంసం జోలికి ఈ కార్తీకమాసం రోజుల్లో మీరు దూరంగా ఉంటే మీరు ఇంకా దైవారాధనలో ఎక్కువ లీనమవుతారు. ఎక్కువ పుణ్యఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే ఈ పవిత్రమైనటువంటి మాసంలో మీరు ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు. నీతి నిజాయితీగా బ్రతకడం అనేది భగవంతుడు ప్రతి ఒక్కరితోనూ చెబుతున్న మాట. ఏ భగవంతుడు ఏ సందర్భంలోనూ ఎవరికి అన్యాయం చేయమని కానీ మరిన్ని రెట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని పాపకర్మలు అనుభవించక తప్పదు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని కించపరచటం, దూషించటం, అన్యాయం చేయడం ద్రోహం చేయడం లాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి.
దీన్ని ఈ ఒక్క మాసానికే కాదు.. సంవత్సరం అంతా అలవాట అయ్యేలా చేసుకోండి. అలాగే కార్తీకమాసంలో ఇవన్నీ చేయకూడని పనులు అయితే చేయాల్సిన పనులేంటి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లాలి. శివ దర్శనం చేసుకోవాలి. శివాలయంలో విశాలయంలో దీపాన్ని వెలిగించటం ఎంతో మంచిది. దీపావళి మొదలు కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజు సంధ్య దీపం వెలిగించాలి. కార్తీకమాసం అంతా కార్తీక పురాణం కనీసం రోజుకు ఒక అధ్యయనం చేయటం అత్యంత శుభకరమని తెలుసుకోండి.