పొలిమేరలో కనిపించిన ఈ అమ్మడు.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరూ..!

ఇప్పటి వరకు ఆమెను నిండైన చీర కట్టులో మాత్రమే చూశారు ప్రేక్షకులు. కానీ ఆమెలో గ్లామరస్ యాంగిల్ ఇంకా అలాగే ఉంది. వాటిని అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ ఉంటుంది. ఆమె ఇన్ స్టా ఫోటోలను చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. అయితే ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలో ‘లచ్చిమి’ పాత్రను కామాక్షి భాస్కర్ల పోషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె పోషించింది గ్రామీణ యువతి పాత్ర.

ఆ సినిమా చూసిన ఎవరైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆర్టిస్ట్ అనే అనుకుంటారు. అందువల్లనే ఆ పాత్రను అంత సహజంగా చేసిందని భావిస్తారు. కానీ కామాక్షి భాస్కర్ల చైనాలో మెడిసిన్ చేసింది. అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా కొంతకాలం పనిచేసింది. ఆ తరువాతనే ఆమె మోడలింగ్ పట్ల ఆసక్తితో అటువైపు వెళ్లి, అక్కడి నుంచి సినిమాల వైపు వచ్చింది. తాజాగా ‘ఐ డ్రీమ్’ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించింది.

“నేను ఎవరితోను ఎక్కైవగా మాట్లాడను .. పార్టీలకు .. ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నాకు బాగా పరిచయమైన వారితోనే కాస్త చనువుగా ఉండగలుగుతాను. నలుగురిలోకి చొచ్చుకుపోయే స్వభావం కాదు నాది. అందువల్లనే నేను ఇండస్ట్రీలో ఇమడలేనని నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. కానీ అలా ఉంటూనే ఇంతవరకూ వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *