కాజోల్ గురించి ప్రత్యేక అవసరం లేదు. ఆమె బాలనటిగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బెఖుడి అనే సినిమాలో నటించి… అందరి దృష్టిని చిన్నతనంలోనే ఆకర్షించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఇక ఆ తర్వాత బాజీగర్ చిత్రంలో కాజోల్ నటించింది. అయితే షోము ముఖర్జీ, తనూజా దంపతులకు జన్మించిన ఈమె 1999 ఫిబ్రవరి 24న మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం అజయ్ దేవగన్ ను వివాహం చేసుకుంది.
ఇకపోతే గూండారాజ్ సినిమాలో నటిస్తున్నప్పుడే అజయ్ దేవగన్ తో ప్రేమాయణం నడిపిన కాజోల్ 1994లో మొదలైన వీరి ప్రేమాయణం 1999 వరకు కొనసాగింది. ఇక అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది ఈ జంట. అయితే అప్పట్లో వీరి జోడి గురించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
ఇద్దరిదీ సరైన జోడి కాదు అంటూ కొంతమంది తీవ్రంగా విమర్శించారు కూడా.. మరి కొంతమంది కెరియర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ కాజోల్ పై చాలామంది ట్రోల్స్ చేస్తూ విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఈ జంట అవేవీ పట్టించుకోలేదు. ఒక ఇంటి వారై కలిసి ముందుకు నడిచారు. ఇక ఆ ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. నైసా అనే అమ్మాయితో పాటు యుగ్ అనే అబ్బాయి కూడా జన్మించారు.