ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పాల్ చెప్పారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని ఆయన అన్నారు. ఈ విషయం చెప్పొచ్చో లేదోనని.. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని తెలిపారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని ఆయన వాపోయారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా చికిత్స తీసుకుంటున్నట్లు పాల్ చెప్పడం గమనార్హం. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ ఆరోపణలు చేశారు.
అయితే రాజారెడ్డి, వైయస్ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని.. ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని తెలిపారు. జగన్ని తిట్టడం.. రాష్ట్రాన్ని నాశనం చేయడం షర్మిల పని అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు. షర్మిల డాన్స్ చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదన్నారు. వైఎస్ పేరుని చార్జిషీట్‌లో సోనియా పెట్టారని.. జగన్‌ను జైల్‌లో పెట్టారని.. వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారన్నారు. వైఎస్ తకు మధ్య గొడవలకు కారణం సోనియా అని చెప్పుకొచ్చారు. ఆమె ఆ పార్టీ నేతలతో పాద పూజ చేయించుకుంటుందన్నారు.