మీటింగ్ కి నన్నెందుకు పిలవలేదు, పోలిసులకి చుక్కలు చూపించిన KA పాల్.

గ్లోబల్ పీస్ మేకర్ గా కేఏ పాల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామంలో జన్మించారు. మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ కు అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. క్రిస్టియనీటి స్వీకరించిన కే పాల్ ఆ తరువాత దేశ విదేశాల అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారంటూ ఆయన గురించి చెబుతారు.

ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా చదువు, ఆరోగ్య సేవలు అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసారు. ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే టీడీపీ- జనసేన – బీజేపీ పొత్తుపై కేఏ పాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ రోజు చీకటి రోజు.. తన కొడుకును సీఎం చేయడానికి, బినామీ సోదరులను కాపాడటానికి మోడీ, అమిత్ షాల దగ్గర చంద్రబాబు నాయుడు సరెండర్ అయ్యారు.

పవన్ కల్యాణ్ గుడ్డిగా తన దత్తత తండ్రిని ఫాలో అవుతున్నారు. ఏపీని రక్షించాలంటే ‘పాల్ రావాలి.. పాలన మారాలి’. వారంతా మన స్టీట్ ప్లాంట్‌లను, తెలుగు ఆత్మగౌరవాన్ని అమ్మేస్తున్నారు. ఎన్టీఆర్ ఇలా ఎప్పుడు చేయలేదు. అంబేడ్కర్, గద్దర్, బాబుమోహన్ విజన్‌లను ముందుకు తీసుకెళ్లాలంటే.. ఏపీ ప్రజలు ప్రజాశాంతి పార్టీలో చేరాలి.’ అని పాల్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *