విశాఖలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మంగళవారం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అదుపులోకి తీసుకుని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సమయంలో కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించిన ఆయన.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని కేకలు వేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ రెండో రోజు దీక్ష కొనసాగించారు.
అయితే దీక్షా శిబిరం నుంచి ఆయనను పోలీసులు బలవంతంగా కేజీహెచ్ కు తరలించారు. అయితే కేజీహెచ్ గేటు వద్ద కేఏ పాల్ పోలీసులతో గొడవ పడ్డారు. నాకేమైనా అయితే సీఎందే బాధ్యత ” నా ప్రాణానికి ఏదైనా అయితే ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత. పోలీసులు నాపై అనుచితంగా ప్రవర్తించారు. నా కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. నా బట్టలు చింపేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంలేదు అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు. ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది.
ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏంచేశారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయొద్దని నేను కోరాను. ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి ఈ ప్రైవేటీకరణ వద్దని కోరారు. నిన్న కూడా కేంద్ర మంత్రుల నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం. ప్రధాని మోదీ నుంచి హామీ వచ్చే వరకు దీక్ష విరమించను” – కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు