నా కూతురు గురించి తప్పుడు రాతలు రాశారు అంటూ కన్నీరు పెట్టుకున్న జీవిత రాజశేఖర్.

శివాని కంటే ముందు చిన్న కుమార్ శివాత్మిక దొరసాని సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా శివాత్మికకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో ఆమెకి జోడిగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించారు. అయితే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తాను కామెంట్‌ చేశానన్న వార్తలపై కూడా వివరణ ఇచ్చారు జీవితా రాజశేఖర్. ఆర్యవైశ్యుల గురించి తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. కోమటి వాళ్ల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే తానా సామెత వాడానని చెప్పారు.

ఎవరైనా బాధపడితే సారీ… అంటూ కాస్త తగ్గారు జీవితా రాజశేఖర్. సినీ పరిశ్రమ వర్గాల్ని పర్మిషన్ అడిగి మరీ ఇలా మీడియా ముందుకొచ్చా అన్నారు. తన మీదొచ్చిన ఎలిగేషన్లు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరి మీదా రాలేదని వాపోతున్నారు జీవిత. 26 కోట్లు మోసం చేశామని తమను రచ్చకీడ్చిన గరుడవేగ సినిమా ప్రొడ్యూసర్లను ప్రస్తావించారు. మేం ఆస్తులమ్ముకుని సగం ఖర్చుపెట్టి సినిమా పూర్తి చేస్తే… ఆఖరికి తమనే దోషులుగా చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. విషయం కోర్టులో వున్నప్పుడు మీడియా ముందుకొచ్చి రచ్చ చేయడం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు జీవిత.

తమ ఫ్యామిలీ మీద సోషల్ మీడియా కత్తి కట్టిందన్నది కూడా ఆమె చేస్తున్న అభియోగం. తన కూతురు ఎవరితోనో లేచిపోయారని రాసిన వార్తల్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. ‘సినిమా పరిశ్రమ చాలా సెన్సిటివ్. సినిమా సెలబ్రిటీల జీవితాలైతే అంత కంటే సున్నితం… తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి… అంతే తప్ప ఇలా గుచ్చిగుచ్చి బాధకు గురిచెయ్యకండి…’ అంటున్నారు జీవిత. రాజశేఖర్ హీరోగా చేస్తున్న శేఖర్ మూవీ రేపే రిలీజౌతోంది. చాలా గ్యాప్ తర్వాత భర్తను డైరెక్ట్ చేస్తూ, సొంత బేనర్‌పై ప్రిస్టీజియస్‌గా జీవిత నిర్మిస్తున్న సినిమా ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *