ఈ హీరోయిన్ పోలీసులకు దొరికిందో.. ఏకంగా జైలుకే జయప్రద. తర్వాత కూడా..?

జయప్రద గురంచి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె ఖాతాలో వేసుకున్నారు. నటిగా కొనసాగున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే సీనియర్ నటి, పొలిటీషియన్ జయప్రద ను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెడెండ్ ఆఫ్ పోలీస్ (SP)ని కోర్టు ఆదేశించింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఏడోసారి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసినప్పటికీ సోమవారంనాడు ఆమె కోర్టుకు గైర్హాజరయినట్టు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి అమర్‌నాథ్ తివారి తెలిపారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద రెండు కేసుల్లో జయప్రద “పరారీ”లో ఉన్నారు.

జయప్రద వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. చెన్నై కోర్టు గత ఏడాది ఒక పాత కేసులో జయప్రదను దోషిగా నిర్దారిస్తూ 6 నెలల జైలు, రూ.5,000 జరిమానా విధించింది. చెన్నైలోని సొంత థియేటర్‌ కార్మికులకు ఈఎస్ఐ సొమ్ము చెల్లించలేదనే ఆరోపణలను జయప్రద ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సిబ్బంది బకాయిలు చెల్లిస్తానని, కేసు కొట్టివేయాలని కోర్టును ఆమె కోరారు. అయితే, కోర్టు ఆమె చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చుతూ 6 నెలల జైలు, జరిమానా విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *