స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు సీఎం జగన్ ఇవాళ వైసీపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు అరెస్టుపై జనంలో ఎలాంటి స్పందన వస్తోందో తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అయితే ఈ కేసులో కోర్టు..
అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చూసి చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు సీఎం జగన్. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు.. పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలిపారు. కోర్టులో సుమారు పది గంటల పాటు వాదనలు జరిగాయని.. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సరైన ఆధారాలతోనే నోటీసులు ఇచ్చారని జగన్ స్పష్టం చేశారు.
అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయ్యారని.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. అవినీతి పరుడికే మద్దతిస్తున్నారంటూ పవన్‌పై మండి పడ్డారు. గతంలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని సీఎం జగన్ మరోసారి గుర్తు చేశారు.