జగన్ కు బిగ్ షాక్! హైకోర్టు నోటీసులు మళ్ళీ జైలు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్ పై విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.

జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

అయితే ఈ నేపథ్యంలోనే పిల్ లో సవరణలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు పిల్ కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అయితే సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ లో కోరిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *