శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.15 కు ఇంద్రకీలాద్రి సీఎం చేరుకోనున్నారు.
అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం తో దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అయితే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు దుర్గమ్మ వారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్య లో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.
సరస్వతిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలి వస్తున్నారు. క్యూలైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.