షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిల కుమారుడిది కూడా ప్రేమ వివాహం అని తెలుస్తుంది. ఇక రాజా రెడ్డి వివాహం చేసుకోబోయే యువతి పేరు ప్రియ అట్లూరిగా తెలుస్తోంది. వీరిద్దరికి అమెరికాలో పరిచయం ఏర్పడిందని.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. అయితే వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
తన కుమారుడు షర్మిల రాజారెడ్డి వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. రాజారెడ్డి అమెరికాలో తన చదువు కోసం వెళ్లగా…. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కమ్మ వర్గానికి చెందిన ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించాడు. అలా నాలుగేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబసభ్యులకు చెప్పడంతో కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే త్వరలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఇక వివాహానికి తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికే వీరి పెళ్లి పనులను ప్రారంభించారట. షర్మిల తన కొడుకు రాజారెడ్డి వివాహం కోసం జగన్ తో సంప్రదింపులు జరిపించారట. గతంలో అన్నా చెల్లెళ్లకు ఆస్తుల విషయంలో గొడవలు జరిగి మాటలు లేకుండా పోయాయి. ఇక కుమారుడి వివాహం కారణంగా జగన్ తో మళ్లీ మాట్లాడుతున్నారట షర్మిల. ఇక తన చెల్లెలు ఇంటికి వచ్చి చెప్పడంతో జగన్ కూడా వివాహ పనులను తన చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నారట.