ఫిబ్రవరి 17న జోధ్ పూర్ లో రాజారెడ్డి- ప్రియ వివాహం జరగనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసిప్షెన్ ను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసిప్షెన్ కు నిర్ణయించారు. ఈ రిసిప్షెన్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రాజారెడ్డి – ప్రియ ఎంగేజ్ మెంట్, వివాహ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్ మరణం తరువాత ఆ కుటుంబలో జరుగుతున్న తొలి శుభకార్యం కావటంతో రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక జరగనుంది. ఎన్నికల వేళ కావటంతో రాజకీయంగానూ ఈ వేడుక పైన ఆసక్తి నెలకొంది. వైఎస్ షర్మిల. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.
షర్మిల తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 18న హైదరాబాద్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధంకు భారీగా ఏర్పట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్ధంతో పాటుగా పెళ్లికి రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్, వివాహ పత్రిక వైరల్ అవుతోంది.