బ్రేకింగ్: హాస్పిటల్లో అరియానా.. ఆ పని కోసమే వెళ్ళిందా..!

అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తోంది అరియానా. హీరోయిన్లతో పాటుగా గ్లామర్ రేసులో నేను కూడా ఉన్నా అంటూ రంగంలోకి దిగిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన లేలేత ప్రాయాలను ఆన్ లైన్ లో పెట్టేస్తూ రచ్చ చేస్తోంది. అయితే తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ సొగసరి. నెట్టింట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ.. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతూ ఉంటోంది.

అలాంటి అరియానా తాజాగా ఆస్పత్రికి వెళ్లింది. దాంతో ఫ్యాన్స్ మా బ్యూటీకి ఏమైంది అంటూ టెన్షన్ పడుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరి ప్రస్తుతం వెకేషన్స్ ను ఎంజాయ్ చేసే పనిలో బిజీగా ఉంది. గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఈవెంట్లు, షోల్లో కనిపించడం మానేసింది. ఫ్రెండ్స్ తో కలిసి టూర్స్ వేస్తూ.. బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక అక్కడి బీచ్ ల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యువకులకు చెమటలు పట్టిస్తోంది.

ఇదిలా ఉండగా.. అరియానా తాజాగా హాస్పిటల్ కు వెళ్లినట్లు తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో అరియానాకు ఏమైంది? అంటూ అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అరియానా డాక్టర్లను కలిసింది పంటి సమస్య కోసం. డెంటల్ ట్రీట్మెంట్ కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఆస్పత్రికి వెళ్లింది. ఇక అక్కడి డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ చేశారని పోస్ట్ లో వివరించింది.

ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఈ బ్యూటీ వివరించింది. ఇదిలా ఉండగా.. అరియానా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బుల్లితెర, వెండితెరపై బాగానే ఆఫర్లు వచ్చాయి. ముక్కు అవినాష్-అరియానా జోడీ చేసిన స్కిట్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారింది. అదీకాక బిగ్ బాస్ షోలో అమర్ దీప్ కు సపోర్ట్ చేసి చివరి వరకు నిలబడింది. దీంతో ఆమె ట్రోల్స్ కు గురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *