తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక, ఏపీలో చంద్రబాబుకి కాస్త ఊపిరితీసుకున్నంత వెసులుబాటు వచ్చినట్టుందని ఏబీఎన్ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
తాను సీఎం అయ్యాక కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నుంచి ఫోన్ కూడా రాలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలు పరిష్కరించుకోవాల్సిన సమయంలో తనకు ఆయన ఫోన్ కూడా చేయలేదని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. తాను టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే కొట్లాడేవాడినని, అంతకు మించి తనకు ఆ కుటుంబంతో వైరమేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి.
వ్యక్తిగతంగా తనకు, ఏపీ సీఎం జగన్ కు వైరం లేదన్నారు. అయితే ఈ ప్రశ్నలో చంద్రబాబుకి ఊరట లభించింది అన్న మాటకు మాత్రం రేవంత్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పలేదు.