జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

సినిమాలో హీరోయిన్గా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈమె కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక రీఎంట్రీ తర్వాత ఇంద్రజ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతూ ఉంది. అయితే జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ కి ఇంద్రజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా అని చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది.

అయితే ఈ షో కి ఎక్కువ కాలం జడ్జిలుగా రోజా, నాగబాబులు ఉన్నారు. వీళ్ళకి ఆ సమయంలో ఒక్కొక్కళ్ళు ఐదు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే వారి తర్వాత అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని టాక్. అయితే ఇంద్రజ జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షల 50వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఇంద్రజ తో పాటు కృష్ణ భగవాన్ గారు కూడా రెండు లక్షల 50 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. జబర్దస్త్ లో రోజా, నాగబాబు ఉన్నప్పుడు వారు ఐదు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునేవారు.

గతంతో పోలిస్తే వీరిద్దరు చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇక ఇంద్రజ సినిమాలలో సరైన పాత్ర వస్తే చేస్తున్నారు. ఎక్కువగా అయితే బుల్లితెర షోలలోనే కనిపిస్తున్నారు. సినిమా కంటే బుల్లితెర పైనే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా అభిమానులకు దగ్గర అయ్యారు. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *