కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ వయసు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే స్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలో బాధపడుతున్నారు.
జ్వరం ఎక్కువగా రావడంతో శుక్రవారం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది. బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో శివరాజ్ కుమార్ చికిత్స పొందుతున్నారు.పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, ఆయన కోలుకుంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరారు, సాయంత్రం జనరల్ చెకప్ పూర్తయ్యింది, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. 61 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కనిపించే హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ చేతిలో పదుల సంఖ్యలో చిత్రాలు ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.