ఈ గ్యాంగులో సీనియర్ నటీమణులు లక్ష్మీ, శరణ్య, హీరోయిన్ ప్రియాంక కాకుండా.. నాని చెల్లెలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు చాలా పెద్దదైదండోయ్. చూస్తుండగానే హీరోయిన్ మెటీరియల్‌గా మారిపోయింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. శ్రియా రెడ్డి కొంతం. ఆమె పక్కా హైదరాబాదీ. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి..
గ్యాంగ్ లీడర్ సినిమా మొత్తం కనిపిస్తుంది. ఈ మూవీ తర్వాత ఏ సినిమాల్లో కనిపించలేదు శ్రియా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, ఎలా ఉంది అని వెతికితే.. షాకింగ్ లుక్స్‌లో షేక్ చేసేస్తుంది. ఆ పిల్ల.. ఈ భామనే అని అనిపించకమానదు. ఇప్పుడు మరింత అందంగా తన చూపులతో కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.
అయితే తెలుగు లో నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో పరిచయమైంది ప్రియాంక అరుల్ మోహన్ . ర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్గా నటించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తమిళంలో మంచి అవకాశాలే వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ప్రియాంక అరుల్ మోహన్‌కు హీరోయిన్గా అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ప్రియాంక అరుళ్ మోహన్ OG సినిమాలో పవన్ సరసన నటించబోతోంది.