సిని రంగంలో రాణించాంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటే వారిని అందలానికి ఎత్తుతారు. ఒకవేళ వరుస అపజయాలు పలకరిస్తే పూర్తిగా మర్చిపోతారు. అయితే ఎంత గొప్ప జీవితం అయినా.. ఎంత డబ్బు పేరు సంపాదించినా.. ఏనిమిషానికి ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే లైఫ్ ఆధార పడి ఉంటుంది. ముఖ్యంగా సిసిమా వాళ్ల జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి.
వారి నిర్ణయాలు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. ఎదురయ్యే సమస్యలు.. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఉన్న ఓ బ్యూటీ.. ఇలానే తన కలర్ ఫుల్ లైఫ్ ను త్యంగం చేసింది. సన్యాసి జీవితం గడుపుతోంది. బాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ అంటే ఓ ప్రత్యేక మైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలు అంటే ఎలా ఉంటాయో అందరికి తెలుసు. హార్రర్ సినిమాలు, హాట్ హాట్ మూవీస్ తీయ్యడలో తనకు తానే సాటి అనిపించుకన్నాడు వర్మ. అలాంటిది వర్మ సినిమాల్లో.. హీరోయిన్లు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన హీరోయిన్లలో ఆడియన్స్ ను భయపెటట్టిన తార బర్జా మదన్. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన భూత్ మూవీలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి ఆడియన్స్ ను భయపెట్టింది బ్యూటీ. దెయ్యంగా భూత్ మూవీలో బర్ఖా మదన్ నటన చూసి థియేటర్లో ప్రేక్షకులు గజ గజ వణికిపోయారంటే … ఆమె ఏ రేంజ్ లో నటించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా చూసిన వారికి పగలు కూడా కల్లోకి వచ్చి భయపెట్టేలా ఉంటుంది బర్జా మదన్ నటన. భయపటెట్టడమే కాదు… ఆతరువాతి సినిమాల్లో తన అందంతో మత్ర ముగ్ధులను చేసింది బ్యూటీ.