మెగాస్టార్ చిరంజీవికి హీరోల్లోనూ అభిమానులు ఉన్నారు. అందులో అందరి కంటే ముందు వరుసలో వచ్చే పేరు శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు… చిరుపై తన అభిమానాన్ని చూపించడంలో శ్రీకాంత్ అసలు సంకోచించింది లేదు. ఆయన అంటే చిరుకు సైతం అంతే ఇష్టం.
అందుకే, తమ్ముడి పుట్టినరోజు నాడు ఇంటికి వెళ్లి మరీ సర్‌పైజ్ చేశారు. అయితే తాజాగా శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా అతని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ . కేక్ కట్ చేయించిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఇంట్లో ఉన్న పలు అవార్డులను చూసుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో కూడా కాసేపు ముచ్చటించారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరంజీవి, శ్రీకాంత్ కాంబోలో మళ్ళీ సినిమా చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. ‘బింబిసారా’ మూవీ ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2025 లో సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.