తమ్ముడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో హీరో నితిన్ కు గాయపడ్డారని తెలుస్తోంది. నితిన్ కు గాయాలు కావడంతో షూటింగ్ ను నిలిపివేశారని తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. తమ్ముడు మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ ఓ భారీ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్ సమయంలో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
అయితే జయం, దిల్ సినిమాలతో అందరి దిల్ దోచుకుని ఆపకుండా సినిమాలు చేస్తున్న నితిన్‌ను కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. భీష్మ సినిమా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం రీసెంట్ రిలీజ్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలు నిరాశని మిగిల్చాయి. ఇదిలా ఉంటే హీరో నితిన్‌కు షూటింగ్‌లో గాయాలయ్యాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చేతికి గాయం కావడంతో షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న’తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో నితిన్ పాల్గొన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్న సమయంలో నితిన్ చేతికి గాయాలయ్యాయని అంటున్నారు. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో నితిన్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.