రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే 11 మంది మంత్రులతో కూడిన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కతోపాటూ సహచర మంత్రి వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు హరీష్ రావు ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు.
‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ హరీష్‌రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.