జిమ్‌లో చెమటోడిస్తున్న ర‌ష్మిక.. వైర‌లవుతున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌ వ‌ర్కౌట్స్ వీడియో.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే రష్మిక మందన్న తాజాగా షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పోస్ట్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా గత నాలుగు అయిదు నెలలుగా నేను బిజీ షెడ్యూల్‌ కారణంగా జిమ్‌ కి దూరంగా ఉన్నాను అంటూ పోస్ట్‌ చేసింది.

సాధారణంగా హీరోయిన్స్ మేకప్‌ మరియు జిమ్‌ ను వదిలి ఒక్క రోజు కూడా ఉండరు అంటారు. కానీ రష్మిక మందన్న ఏకంగా నాలుగు అయిదు నెలలు జిమ్ కు దూరంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని నెలలు వర్కౌట్ చేయకున్నా కూడా రష్మిక ఫిజిక్ లో మార్పు రాలేదు.. పైగా అందం మరింత పెరిగింది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఇకపై రెగ్యులర్‌ గా వర్కౌట్స్ చేస్తాను అని, తన డైలీ లైఫ్‌ లో ఏదో ఒక సమయంలో జిమ్‌ కి వెళ్తాను అన్నట్లుగా రష్మిక తన పోస్ట్‌ లో పేర్కొంది. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల శ్రీవల్లి గెటప్ లోని వీడియో వైరల్‌ అయ్యింది. యానిమల్‌ సూపర్‌ హిట్ నేపథ్యంలో రష్మిక మందన్న కు బాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖ హీరోలు మరియు దర్శకుల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక తెలుగు లో మరియు తమిళంలో ఈ అమ్మడి సినిమాల జోరు మామూలుగా లేదు అనే విషయం తెల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *