గూగుల్ పే వాడే వారికి అదిరే గుడ్ న్యూస్. అదేంటో తెలిస్తే..?

కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్గాల్లో అమాయక జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల విషయంలో వినియోగదారుల మరింత అప్రమత్తం చేయడం లక్ష్యంగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ను డిజిటల్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ ప్రవేశపెట్టింది. అయితే గూగుల్ పే తన యూజర్ల కోసం కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. పిన్ లేకుండానే మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లేదంటే పేమెంట్లు చేయొచ్చు. అలాగే క్రెడిట్ స్కోర్ సులభంగానే చెక్ చేసుకోవచ్చు.

ఈ రెండూ సేవలు గూగుల్ పే యూజర్లు పొందొచ్చు. అందువల్ల మీరు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని భావిస్తే.. ఉచితంగానే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీరు ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. ఇప్పుడు కిందకు రావాలి. ఇక్కడ చెక్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చెక్ యువర్ స్కోర్ నౌ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాన్ కార్డులోని పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

అలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ స్క్రీన్‌పై మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో కనిపిస్తుంది. అలాగే మీ పేమెంట్ హిస్టరీ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు సులభంగానే క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు. అలాగే గూగుల్ పే మీకు లోన్ ఆఫర్లు కూడా అందిస్తోంది. డబ్బులు అవసరం అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మరోవైపు గూగుల్ పే యూపీఐ లైట్ అనే సర్వీసులు కూడా తీసుకువచ్చింది. మీరు పిన్ లేకుండానే పేమెంట్లు చేయొచ్చు. యూపీఐ లైట్ ద్వారా మీరు మీ వాలెట్‌లోకి రూ.2 వేల వరకు డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ ఫెసిలిటీ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *