గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలలో నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు అంటే మొదటగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరే గుర్తొస్తుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో, కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు.
ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు…. లేదంటే అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఇలా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ చిన్నా, పెద్ద, ముసలి వాళ్లు అన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటిస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఆయనలోని చమత్కారాన్ని తెలియజేస్తాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన… బాగున్నావా అక్క… ఏరా చిన్నా…. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.