అంతర్జాతీయంగా, దేశీయంగా మారుతున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి పసిడి, వెండి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ కొంచెం కిందకు దిగింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,430గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,280లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,550వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,410 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,250కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది. వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.