ఆ విషయంలో నాగార్జున , వెంకటేష్ మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

నాగార్జున వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే .అయితే పెళ్లికి ముందు అక్కినేని నాగార్జున మరియు వెంకటేష్ చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇక నాగార్జున ఎప్పుడు వెంకటేష్ ని ఒరేయ్ అని పిలిచేవాడు. అనంతరం వెంకటేష్ సోదరి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. ఇక పెళ్లిలో కలిసి వీరిద్దరూ డాన్స్ కూడా వేయడం జరిగింది. అయితే రామానాయుడు వారసుడు ఇండస్ట్రీకి వచ్చిన వెంకటేష్ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా రామానాయుడు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు.

అయితే చాలా రోజుల నుంచి వెంకటేష్ కి నాగార్జున కి మధ్య మాటలు లేవు అంటూ చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి. నిజానికి వీళ్ళ మధ్య మాటలు ఇప్పుడు అనే కాదు చాలా రోజుల నుంచి లేవు అనేది వాస్తవం… ఎందుకంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకుని నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వడం అనేది వెంకటేష్ నచ్చలేదు. అందుకే అప్పటి నుంచి నాగార్జునకి, వెంకటేష్ కి మధ్య మాటలు లేవు. ఇక విద్దరు కూడా మాట్లాడుకోవడం లేదు. ఇక రీసెంట్ గా నాగచైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వం లో వస్తున్న తండేల్ సినిమా కి సంబంధించిన పూజ కార్యక్రమానికి వీళ్ళిద్దరిని నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా పిలిచి అక్కడ వీరిద్దరి మధ్య మాటలు కలపడానికి ప్రయత్నం చేశాడు.

ఇక వీళ్లీద్దరు కూడా అక్కడ సన్నిహితంగా కనిపించి మాట్లాడుకున్నారు. ఇంతకుముందు కూడా నాగార్జున శివ సినిమాకు సంబంధించి 25 ఇయర్స్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ హాజరయ్యాడు. అయితే గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య ఒకసారి కూడా మాటలు లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే పెద్దగా లేదు. కానీ శివ సినిమా 25 ఇయర్స్ వేడుక కి రావడం అలాగే నాగచైతన్య సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాల్లో నాగార్జున, వెంకటేష్ లు కూడా పాల్గొనడం వల్ల వాళ్ల మధ్య కొంతవరకైతే మాటలు ఇప్పుడు కలుస్తున్నట్టుగా తెలుస్తుంది.

దాంతో ఇటు నాగార్జున అభిమానులు, అటు వెంకటేష్ అభిమానులు ఇద్దరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక అక్కినేని, రామానాయుడు రెండు ఫ్యామిలీ లు కూడా కలిసినట్టే అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు…ఇక వెంకీ, నాగ్ కంబో లో ఒక సినిమా వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *