రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు. వైఎస్ మరణించిన తర్వాత సానుభూతి అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు వెల్లువలా వచ్చింది. అలాగే ప్రస్తుతం సానుభూతిని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ లపై వేధింపులకు పాల్పడుతున్నారని తప్పుడు కేసులో వేధిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై టీడీపీ పార్టీ పెద్దల్లో ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధమయిందని చెబుతున్నారు.
నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా తెలిపారు. దీంతో టిడిపి నేతలు ఈ విషయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారిపై కక్ష సాధిస్తున్నారని ప్రజలు అనుకునే వ్యవహారాలను ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వాలు చేయవు. రాజకీయాల్లో పండిపోయిన అందరికీ సానుభూతి ని మించిన అస్త్రం ఉండదని తెలిసి.వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన సానుభూతి వెల్లువలో వైఎస్ జగన్ తడిచి ముద్దయ్యారు.