ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న అత్యవసర నిర్ణయాల ప్రతిపాదనలు వివిధ శాఖల కార్యదర్శులు నేరుగా ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి పంపేస్తున్నారు.
దీంతో వీటి సీరియస్ నెస్ ఏంటన్నది వారికీ అర్దం కాని పరిస్దితి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కీలక ఆదేశాలు అందాయి. వీటి ప్రకారం సీఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహిస్తూ వైసీపీ నేతలు బరితెగింపులకు పాల్పడుతున్నారు. అలాగే వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేకాతరు చేస్తూ కొందరు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో వైసీపీ, వాలంటీర్ల ఆగడాలపై కన్నెర్ర చేసిన ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది.