సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవాళ్లు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ చాలామంది దానిని పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి కొందరు ప్రాణాలు కోల్పేతే మరికొందరు పక్కన ఉన్న వారి ప్రాణాలు తీయడంలో లేక యాక్సిడెంట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడమో ఇలా తరుచూ జరుగుతూనే ఉన్న విషయం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది చట్టరిత్యా నేరం కూడా.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను అదుపులో ఉంచేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు ప్రచారాలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉంటాం.
ఈ లిస్టులో ముందుగా మాస్ హీరో రవితేజ సోదరుడు భరత్ ఒకరు.భరత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూనే ఉండడం మనం చూసాం.ఆ మధ్య కాలంలో ఇండస్ట్రీలో డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి వ్యవహారాల్లో అతని పేరు ఎక్కువగా వినపడేది. ఇలాంటి వ్యవహారాల్లో అనేక మార్లు ఆయన పోలీసులకు దొరికిపోయాడు. నవదీప్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ప్రతి ఒకరికి తెలిసిన నటుడు.నవదీప్ ఒక పార్టీ కి వెళ్లి వస్తున్న సమయంలో.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులు నవదీప్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. యూత్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకడు నిఖిల్.
ఇతను కూడా 2011లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. నిఖిల్ ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ లిస్టులో తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే నటుడు శివ బాలాజీ. ఈయన కూడా ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో శివ బాలాజీ మీడియా పై ఫైర్ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లిస్టులో కోన వెంకట్, సాయి రోహిత్, బి.వి.ఎస్.రవి, రాజా రవీంద్ర, యాంకర్ ప్రదీప్ లు కూడా ఉన్నారు.