మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ బస్సు డ్రైవర్ గా మారిపోయారు. తన నియోజకవర్గం మచిలీపట్నం నుంచి వైసీపీ సిద్ధం సభకు ఏలూరు వెళ్లేందుకు బయలుదేరిన కార్యకర్తల్ని ఎక్కించుకుని బస్సులో స్వయంగా బయలుదేరారు. అయితే సిద్ధం సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్ గా మారారు.
ఆయన మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు. ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) కూడా ఉన్నారు. పేర్ని కిట్టుకు మచిలీపట్నం వైసీపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పేర్ని నాని గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఆయన నేషనల్ హైవేపై ఎలాంటి తడబాటు లేకుండా సాఫీగా బస్సు నడిపారు. వైసీపీ లోగో ఉన్న టీషర్టు, వైసీపీ రంగులున్న టోపీ ధరించిన పేర్ని నాని… రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాల్లోని వారికి అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.